![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -380 లో.. ఆదర్శ్, మురారి, ప్రసాద్, మధు కలిసి డ్రింక్ చేస్తుంటారు. అందులోకి ఆమ్లెట్ కోసం సుమలతని పిలిచి చేసి తీసుకొని రా అని అంటాడు. దాంతో సుమలత తిట్టిన తిట్టు తిట్టకుండా అందరిని తిట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు తొండ విషయం కనుకోవాలని ఆదర్శ్ ని మధు అడుగుతాడు. మరొకపక్క ఆదర్శ్ ఎక్కడ అని ముకుంద వెతుక్కుంటూ వస్తుంటే డ్రింక్ చేస్తూ ఉండడం చూసి.. ఎక్కడ నిజం చెప్తాడోనని భయపడి కృష్ణ దగ్గరకి వెళ్లి.. వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు పెద్ద అత్తయ్య చూస్తే గొడవ అవుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గరకి తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత ముకుందపై తొండ పడి అరిచింది అన్నారు కదా.. తొండ అయితే అటు పక్కోకో ఇటు పక్కకో వెళ్ళాలి అంతే గాని అక్కడే ఉండే గట్టిగా అరవడమేంటని డ్రింక్ చేస్తూ ఆదర్శ్ ని మధు అడుగుతాడు. అవును అది పాయింటే అని మురారి అంటాడు. అంటే ముకుంద తొండ పడి కాదు ఇంకేదో జరిగి అరిచిందని మీ డౌట్ కదా అని ఆదర్శ్ అంటూ నిజం చెప్పబోతుంటే.. అప్పుడే కృష్ణ ముకుంద అక్కడికి వస్తారు. మీరు ఇలా తాగితే పెద్దత్తయ్య తిడుతారని ఆదర్శ్ ని ముకుంద అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఆదర్శ్ గదిలోకీ వెళ్తు కిందకి పడిపోతుంటే.. అప్పుడే ముకుంద పట్టుకొని జాగ్రత్త ఆదర్శ్ అని చెప్తుంది. సారీ నీకు చిన్న చిన్న సరదాలు లేకుండా చేస్తున్నానని ముకుంద తన మనసులో అనుకుంటుంది. పెద్దత్తయ్యకి ఇలా తాగడం ఇష్టం ఉండదు.. మురారీకి అలవాటు లేదు. బయటకు వెళ్లి తాగి వస్తాడు. మధుని పట్టించుకోరు. మీరు ఇలా తాగితే అత్తయ్య బాధపడుతుందని ఆదర్శ్ కి ముకుంద సున్నితంగా చెప్తుంది. మీరు కావలనుకుంటే ఈ గదిలో డ్రింక్ చెయ్యండి. మీకు నేను కంపెనీ ఇస్తాను. ఏదో జ్యూస్ తాగుతు మాట్లాడుకుంటుందామని ముకుంద అనగానే ఆదర్శ్ చాల హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. వాళ్ళు డ్రింక్ చేసినట్లు భవానికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తారు. నేను డ్రింక్ చేసాను.. ఇలా చేస్తే ముకుంద, మీరు బాధపడుతారని, తను నాతో గొడవ పడింది. మీరంటే ముకుందకి చాలా ప్రేమ గౌరవమని ఆదర్శ్ చెప్తుంటాడు. ఒకరిపై ప్రేమ గౌరవం ఉందని ప్రత్యేకించి చెప్పలా అని అని మురారిని ముకుంద అడుగుతుంది. అవసరం లేదని మురారి అంటాడు. తరువాయి భాగంలో ఆదర్శ్, ముకుందలకి కృష్ణ రింగ్స్ తీసుకొని వస్తుంది. ఇద్దరు ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |